మూడు నెలల ముందే ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి అర్జితసేవ ఆన్‌లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. జూన్ నెల కోటాకు మొత్తం 60,666 అర్జితసేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనరల్ కేటగిరీలో 50,700 టిక్కెట్లు కాగా, మిగతావి ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా కేటాయించేవి. జనరల్ కేటగిరిలోని మొత్తం 50,700 టిక్కెట్లలో విశేషపూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, అర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు. ఇందులో సుప్రభాతసేవ 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725 టిక్కెట్లు ఉన్నాయి.
జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు.. అందుబాటులోకి 60 వేలకుపైగా టిక్కెట్లు